హనుమకొండ జిల్లా పరకాల పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బొచ్చు విష్ణు కుటుంబ సభ్యులను డిశ్చార్జ్ చేసుకొని గురువారం సాయంత్రము ఆటోలో పరకాలకు వస్తున్నారు. ఈ క్రమంలో రామకృష్ణాపురం వద్ద గుర్తుతెలియని వాహనము ఢీ కొట్టిన సంఘటనలో పలువురు గాయాలపాయలైనారు. విషయాన్ని తెలుసుకున్న ఒకటో వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ క్షతగాత్రులను వెళ్లి పరామర్శించారు. గాయాల బారినపడి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విష్ణువుని ఫోన్లో ఆయన పరామర్శించారు.