పరకాల ఎమ్మెల్యే రేవూరి ఆదివారం హన్మకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ జిల్లా ప్రిపరేషన్ మీటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్" పరకాల నియోజకవర్గ వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు.