పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్ శనివారం అన్నారు. ఖమ్మం జిల్లాలో ఈ నెల 25, 26, 27 మూడు రోజులపాటు విద్యారంగా సమస్యలపై సభలు జరగనున్నాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ గురుకుల హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించుటతో పాటు పర్మినెంట్ టీచర్, లెక్చరర్ ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.