హనుమకొండ జిల్లా పరకాల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను అందజేశారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని ఆకాంక్షించారు.