పరకాల ఎమ్మెల్యే రేవూరి బుధవారం దామెర మండలం ఊరుగొండలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో 4రోజులుగా నిర్వహిస్తున్న వేడుకలకు హాజరయ్యారు. నూతన సుదర్శన చక్ర సహిత శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవంలో ఎమ్మెల్యే బుధవారం పాల్గొన్నారు. అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయాలను కాపాడుకోవాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు.