భారత రాజ్యాంగాన్ని విచ్చిన్నం చేసే కుట్రలను తిప్పి కొట్టాలి అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి ఆత్మకూరు మండలంలోని పెద్దాపూర్&లింగమడుగు పల్లె గ్రామాలలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అభియాన్ పాదయాత్రలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కుల, మత, ప్రాంత, లింగ, ధనిక, పేద భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కులు, బాధ్యతలు కల్పించిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అన్నారు.