పరకాల మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ ఆకస్మిక తనిఖీ

68చూసినవారు
పరకాల మున్సిపల్ కమిషనర్ వెంకటేష్ ఆకస్మిక తనిఖీ
పరకాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో బుధవారం కమిషనర్ వెంకటేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. సమస్యలపై మాజీ కౌన్సిలర్ మడికొండ. సంపత్ కుమార్ మంగళవారము కమిషనర్ కు వ్రాతపూర్వకంగా తెలియపరచగా ఆయన నేడు పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వార్డులో శానిటేషన్ పనులు సక్రమంగా జరిగే విధంగా చూస్తానని, పరిశుభ్రంగా ఉండేలా చూస్తానని తెలిపారు. కమిషనర్ వెంట మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్, దుబాసి. తిరుపతి, మద్దెల. కళ్యాణి, నిర్మల ఉన్నారు.

సంబంధిత పోస్ట్