పరకాల: వార్డును పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కమిషనర్ కు వినతిపత్రం

52చూసినవారు
పరకాల: వార్డును పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కమిషనర్ కు వినతిపత్రం
పరకాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ప్రజల సౌకర్యార్థం వార్డును పరిశుభ్రంగా ఉండేలా చూడాలని కమిషనర్ కు మాజీ కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో డ్రైనేజీలు క్రమంగా తీయక దుర్వాసన వస్తుందని, ఇంటింటికి స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరించాలని, నల్లాల ద్వారా ఇంటింటికి క్రమం తప్పకుండా నీళ్లు అందే విధంగా చూడాలని, వీధిలైట్లు వెలుగని చోట వెలిగేలా చూడాలని మంగళవారం కోరారు.

సంబంధిత పోస్ట్