హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో బుధవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రసగించారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆలోచన మేరకు పరకాల నియోజకవర్గంలో యూత్ కాంగ్రెస్ నాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తానని ఆయన అన్నారు. పరకాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.