నడికూడ మండలంలోని రాయపర్తి పిహెచ్సి హెచ్ ఈవో రాజ్ కుమార్ విధి నిర్వాహణలో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ అవార్డుకు ఎంపిక కావడంతో గురువారం హనుమకొండ ఫరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, రాష్ట్రమంత్రి కొండ సురేఖ చేతుల మీదుగా ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విధి నిర్వాహణలో పట్టుదలతో పనిచేసిన అధికారులను గుర్తించి ఉత్తమ అవార్డులు ఇవ్వడం గర్వంగా ఉందని అన్నారు.