బిజెపి యేతర రాష్ట్రాలకు బడ్జెట్లో వివక్షత చూపుతూ సమైక్య స్ఫూర్తి కి విరుద్ధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు నిధుల కేటాయింపులో మొండి చేయి, కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సోమవారం పరకాల బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సెంటర్ వరకు నల్ల బ్యాడ్జి లతో నిరసన చేపట్టారు.