గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోనీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయంలో గురువారం రానున్న శ్రావణమాసం ఉత్సవాల గురించి శ్రీ స్వామివారి మూల విగ్రహాలకు ఉత్సవ విగ్రహాలన్నింటిని శుద్ధి చేశారు. అనంతరం మూలవిరాట్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పురుషోత్తమా చారి, అర్చకులు సతీష్, రాజు తదితరులు పాల్గొన్నారు.