పరకాల డివిజన్ వ్యాప్తంగా మంగళవారం అర్ధరాత్రి వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. కల్లాలో అరబోసిన మిర్చి, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి.
ఈదురుగాలుల బీభత్సవానికి వరి ధాన్యం నేలారాలింది. వడగళ్ల వాన బీభత్సవానికి దెబ్బతిన్న పెంకుటిల్లు, సిమెంటు రేకుల షెడ్లు, విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు, గ్రామాల్లో విద్యుత్ కు అంతరాయం కలిగింది. రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.