వరంగల్: ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

82చూసినవారు
వరంగల్: ఈవీఎం గోదాములను పరిశీలించిన కలెక్టర్ డాక్టర్ సత్య శారదా
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో జిల్లా గోదాములను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, ఆదనవు కలెక్టర్ సంధ్యారాణితో కలసి శనివారం పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని జిల్లా ఈవీఎం గోదాములను కలెక్టర్ తనిఖీ చేసి, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ గోదాంలకు సంబంధించిన రికార్డులు, కట్టుదిట్టమైన భద్రత చర్యలు, సీసీ కెమెరాల నిరంతర పర్యవేక్షణ గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్