లండన్ లో ఉంటున్న వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజు, శ్రావ్య దంపతులు, తాళ్ల పెళ్లి హైమ జ్ఞాపకార్థం సుమారు పదివేల విలువ గల 200 లీటర్ల సామర్థ్యం కలిగిన స్టీల్ వాటర్ ట్యాంక్ ను చర్లపల్లి ప్రాథమిక పాఠశాలకు బుధవారం పిఆర్జియు హనుమకొండ జిల్లా శాఖ అధ్యక్షులు మందల తిరుపతిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా మందల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, దాతలు ముందుకు రావాలని అన్నారు.