పరకాల పట్టణంలో తడిసి ముద్దయిన వడ్లు

71చూసినవారు
పరకాల పట్టణంలో తడిసి ముద్దయిన వడ్లు
పరకాల పట్టణంలో అకాల వర్షానికి వడ్లు తడిసి ముద్దయిన సంఘటనలో రైతు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆరుగాలం పండించిన పంట చేతికి వచ్చి డబ్బులు వస్తాయన్న సమయంలో పంట మొత్తం నీటి మునిగి ముద్దవ్వడంతో రైతు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి అకాల వర్షాలకు జరిగిన పంట నష్టానికి అధికారులు, నాయకుల దృష్టికి తీసుకువెళ్లి తక్షణ సహాయం అందేలా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్