వరంగల్: ఒక్క ఏడాదిలోనే నియోజకవర్గ అభివృద్ధికి రూ 800కోట్లు మంజూరు

64చూసినవారు
వరంగల్: ఒక్క ఏడాదిలోనే నియోజకవర్గ అభివృద్ధికి రూ 800కోట్లు మంజూరు
ఒక్క ఏడాది కాలంలోనే ఒక నియోజకవర్గ అభివృద్ధికి రూ 800కోట్ల నిధులు కేటాయించడం చాలా గొప్ప విషయమని, ఇది మన పైన, మన నియోజకవర్గం పైన ముఖ్యమంత్రికి ఉన్న ప్రేమకు నిదర్శనమని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. గురువారం వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాల నుండి సీఎం సభ జన సమీకరణపై గ్రామాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్