డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాల కోసం ఈ నెల 18 వరకు గడువు ఉందని ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్ సుంకరి జ్యోతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అభ్యర్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. www. braou. ac. inలో ఈనెల 18 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.