మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్ప్రింగ్ సీజన్ అడ్మిషన్ తీసుకున్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలన్నారు.