గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి

1036చూసినవారు
గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి
రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన పూజారి నర్సింహులు(32) అనే ఆటో డ్రైవర్ గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం నరసింహులు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి 2గంటల సమయంలో చాతిలో నొప్పి వస్తుందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించగా వైద్యులు పరీక్షిస్తుండగానే మృతి చెందాడు. ఆయన మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.