నీజాయితీతో పని చేసి ప్రజల మన్ననలను పొందాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. వార్షిక తనీఖీల్లో భాగంగా స్టేషన్ ఘన్ పూర్ ఏసిపి కార్యాలయమును బుధవారం తనీఖీ చేసారు. కార్యాలయమునకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు, గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరును పోలీస్ కమిషనర్ ఏసిపి కిషన్ ను అడిగి తెలుసుకున్నారు.