వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం సాయంత్రం వెస్ట్‌జోన్ పరిధిలోని చిల్పూర్, తరిగొప్పుల, నర్మెట్ట, పోలీస్ స్టేషన్ల తోపాటు వెస్ట్ జోన్ డిసిపి కార్యాలయమును సందర్శించారు. ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, సిసి కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను సిపి సంబంధిత స్టేషన్‌ల సీఐ లను అడిగి తెలుసుకున్నారు.