జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ డివిజన్ పరిధిలోని ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని స్టేషన్ ఘనపూర్ ఆర్డీఓ డిఎస్. వెంకన్న సూచించారు. శుక్రవారం మన జిల్లా - మన నీరు కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో కార్యాలయ ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు కార్యక్రమమాన్ని ఆయన ప్రారంభించారు. భూగర్భ జలాల అభివృద్ధికి గ్రామాల్లో ఇంకుడు గుంతల ఏర్పాటుకు అధికారులు, ప్రజాప్రతినిధులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మహిళా సంఘాలు ప్రజలను చైతన్య పరచాలన్నారు.