
ప్రముఖ సీనియర్ నటి పుష్పలత కన్నుమూత
ప్రముఖ సీనియర్ నటి పుష్పలత (87) కన్నుమూశారు. వృద్ధాప్యం కారణంగా.. మంగళవారం చెన్నైలోని తిరుమల పిళ్లైలో ఉన్న తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో వందకు పైగా సినిమాల్లో ఆమె నటించారు. తెలుగులో కొండవీటి సింహం, రాము, యుగపురుషుడు, వేటగాడు, ఆడబిడ్డ, చెడపకురా చెడేవు తదితర సినిమాల్లో కీలక పాత్ర పోషించారు. పుష్పలతకు ఇద్దరు కూతుళ్లు. వారిలో ఒకరు నటి మహాలక్ష్మి.