ఇంటర్ ఫస్టియర్ లో ప్రవేశాల కోసం ఆగస్టు 20వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు హనుమకొండ జిల్లా విద్యాశాఖ అధికారి గోపాల్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ ఆగస్టు 20వ తేదీ వరకు అడ్మిషన్లకు అవకాశం ఇచ్చారని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.