జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ లో మంగళవారం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సింగారపు రవి (45) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు హన్మకొండ జిల్లా , ధర్మసాగర్ మండలం ధర్మపురం కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.