రఘునాథపల్లిలో బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు పుప్పాల వేణుకుమార్ అధ్యక్షతన మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మోడీ ప్రధాన మంత్రిగా 3వ సారీ అధికారంలోకి వచ్చాక కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ నేతృత్వంలో 2025 -26 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం 12 లక్షలు ఉంటే, ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేని బడ్జెట్ రూపొందించారన్నారు.