తెలంగాణ రాష్ట్రంలో సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులపై వరంగల్ ఎంపీ కడియం కావ్య పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయం లో కేంద్రాన్ని సమాచారం కోరారు. గురువారం కావ్య వేసిన లిఖిత పూర్వక ప్రశ్నకు కేంద్ర మంత్రి శ్రీపాద్ యశోనాయక్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలో 266 సోలార్ పవర్ ప్లాంట్లు మంజూరు కాగా అందులో అక్టోబర్ మాసాంతానికి 263 ఉత్పత్తి చేస్తున్నాయన్నారు.