జాతీయ రహదారి పై ప్రమాదాల నివారణతో పాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య తెలిపారు. బుధవారం జాతీయ రహదారి 163పై స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని 5గ్రామాలలో మంజూరు అయిన 5 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నేషనల్ హైవే అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలోపర్యటించి స్థల పరిశీలన చేశారు.