అక్రమంగా నిల్వ ఉంచిన రెషన్ బియ్యాన్ని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. స్టేషన్ ఘనపూర్ పరిధిలోని భూక్య బిక్కు ఇంటిపై దాడి చేసి 19 క్వింటాళ్ల రేషన్ బియ్యం ను పట్టుకొని స్థానిక పీఎస్ కు అప్పగించినట్లు తెలిపారు. వీటి విలువ 50 వేల రూపాయలు ఉంటుందన్నారు.