ప్రభుత్వ అనుమతి లేకుండా మద్యాన్ని విక్రయిస్తున్న వారిని రఘునాథపల్లి మండలంలో పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై వివరాల ప్రకారం వెల్ది గ్రామంలో దొమ్మట యాకయ్య తన ఇంట్లో అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం ఆ ఇంట్లో సోదా చేయడంతో రూ: 4, 800 విలువైన మద్యం సీసాల లభ్యమయ్యాయి. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.