ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లా జట్లకు ఇంటర్ డిస్ట్రిక్ట్ లీగ్ పోటీలు ఈ నెల 19 నుంచి నిర్వహించనున్నారు. పోటీల్లో పాల్గొనాలనుకునే 6 జిల్లా జట్ల ఎంపికలు ఈ నెల 15, 16వ తేదీల్లో కరుణాపురంలోని వంగపల్లి క్రికెట్ క్రీడా మైదానంలో నిర్వహించనున్నట్లు డబ్య్లూడీసీఏ కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ బుధవారం తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.