వరంగల్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఇద్దరికి మెజిస్ట్రేట్ మూడు రోజులపాటు సామాజిక సేవ చేయాలని ఆదేశించారు. దేశాయిపేటకు చెందిన ఉదయ్ కుమార్, ధర్మసాగర్ కు చెందిన నాగరాజు బుధవారం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేసినట్లు ట్రాఫిక్ సీఐ రామకృష్ణ తెలిపారు.