మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

74చూసినవారు
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో కొలువై ఉన్న గట్టు మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారంను పురస్కరించుకొని భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. ముందుగా భక్తులు ఆలయ ప్రాంగణంలో స్వామివారికి ఒగ్గు పూజారులచే పట్నాలు వేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్