జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం చిన్నారులకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం స్లేట్, పెన్సిల్స్ పంపిణీ చేసి గర్భిణులకు, పిల్లలకు, పిల్లల తల్లులకు స్వయంగా బిర్యానీ వడ్డించి, చిన్నారులతో కలిసి భోజనం చేశారు. అనంతరం అంగన్వాడీ ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకన్న, డీపీఆర్వో పల్లవి తదితరులు పాల్గొన్నారు.