జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్ల తీగలను అపహరించారు. ఆదివారం ఉదయం రైతులు బావుల వద్దకు వెళ్లి చూడగా తీగలు చోరీకి గురి కావడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో కూడా తీగలు చోరీ అయినట్లు బాధితులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు చోరీలను కట్టడి చేయాలంటూ రైతులు కోరారు.