జనగామ జిల్లా చిల్పూర్ మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన భూక్య రవి అనే వ్యక్తి భూక్య రామచంద్రం వద్ద నుంచి 20 సంవత్సరాల క్రితం 10 గంటల భూమిని కొనుగోలు చేశారు. అప్పటినుంచి ఈ భూమిని రవి సాగు చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఇటీవల భూమిని రిజిస్ట్రేషన్ చేయమని రామచంద్రుని కోరగా అతను మాట మార్చి ఇబ్బందులకు గురి చేస్తున్నాడంటూ రవి బుధవారం వాపోయారు. అధికారులు స్పందించి న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.