గుట్కా ప్యాకెట్స్ పట్టివేత

68చూసినవారు
గుట్కా ప్యాకెట్స్ పట్టివేత
స్టేషన్ ఘనపూర్ మండలం శివునిపల్లిలో అక్రమంగా గుట్కా ప్యాకెట్లను నిల్వ చేసి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. రాడపాక శ్రీనివాస్, తోట నరసయ్యలు నిషేధించిన గుట్కాలను అక్రమంగా విక్రయిస్తుండగా దాడులు నిర్వహించి రూ: 3450 విలువైన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్