ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలో అత్తింటి వేధింపులతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం వక్కల భద్రయ్య కుమార్తె సుప్రియ(29)కు కొలిపాక రమేష్ తో 2013లో వివాహమైంది. భర్త రమేష్ గత కొంతకాలంగా అదనపు కట్నం కోసం అమెను వేధిస్తుండడంతో మనస్థాపం చెంది ఆదివారం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.