బైక్ అదుపు తప్పి డివైడర్ కు ఢీకొట్టిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. హన్మకొండ వడ్డెపల్లి-మార్గంలో నిరూప్ నగర్ తండా వద్ద ఈ ఘటన జరిగింది. ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామానికి చెందిన మాచర్ల రాజు ఓ డయాగ్నస్టిక్ సెంటర్లో పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని బైక్పై ముప్పారానికి బయల్దేరాడు. నిరూప్నగర్ తండా పెట్రోల్ పంప్ వద్ద బైక్ అదుపు తప్పి డివైడర్ కు ఢీకొట్టగా అక్కడక్కడే మృతి చెందాడు.