ఉపకార వేతనాలకు 31 మంది ఎంపిక

59చూసినవారు
ఉపకార వేతనాలకు 31 మంది ఎంపిక
సాంకేతిక విద్యలో బాలికలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రగతి ఉపకార వేతనాలకు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన 31 మంది బాలికలు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ ప్రభాకర్ శుక్రవారం పేర్కొన్నారు. ఎంపికైన ఒక్కొక్కరికి ఏటా రూ. 50 వేల ఉపకార వేతనాన్ని మూడేళ్ల పాటు అందిస్తారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 206 మంది బాలికలు ఎంపిక కాగా అందులో 31 మంది కళాశాలకు చెందిన వారు ఉన్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్