నిరుపేదల సంక్షేమం అభివృద్దే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్లో జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ఖిలా వరంగల్, వరంగల్ మండలాలకు చెందిన 454 మంది లబ్ధిదారులకు రూ. 3 కోట్ల 97 లక్షల 96 వేల 308 రూపాయల సీఎం ఆర్ ఎఫ్, కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.