వన మహోత్సవం-2025 పోస్టర్లను మంత్రి తన కార్యాలయంలో బుధవారం అధికారులతో కలిసి మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. ఈ ఏడాది మహోద్యమంలా వనమహోత్సవం నిర్వహించబోతున్నామని, వనమహోత్సవ కార్యక్రమంలో ప్రజలంతా స్వచ్ఛందంగా అధిక సంఖ్యలో పాల్గొనాలని మంత్రి పిలుపునిచ్చారు. అందరినీ భాగస్వాములను చేస్తూ చెట్లు నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.