వరంగల్ బట్టలబజార్ లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి 6 వరకు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. బుధవారం గరుడవాహన సేవపై వెంకటేశ్వర స్వామివారిని ఆలయ పురవీధుల వెంబడి గోవిందనామ స్మరణతో చేస్తూ శోభయాత్రగా నిర్వహించారు.