వరంగల్ సీపీ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ఎంపిక చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందికి మడికొండ సిటీ పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండు రోజుల పునఃశ్చరణ శిక్షణ తరగతులను శుక్రవారం అదనపు డీసీపీ రవి ప్రారంభించారు. శిక్షణ భాగంగా సిబ్బందికి శారీరక వ్యాయామం తో పాటు శాంతి భద్రతల పరిరక్షణకై నిర్వహించాల్సిన విధులపై శిక్షణ అందజేస్తారు. సిటీసి వైస్ ప్రిన్సిపల్ రమణ బాబు, సీఐ లుఆర్ఐ ఉదయ భాస్కర్ సిబ్బంది పాల్గొన్నారు.