ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము చదువుల చెట్టు నీడలో అంటూ హన్మకొండ జిల్లా కొత్తకొండ గ్రామ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 1991-1992 బ్యాచ్‌కు చెందిన పూర్వవిద్యార్ధులు ఆదివారం కలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్ధిరపడిన వారంతా ఒకేచోటకు చేరుకొని ఆప్యాయంగా పలకరించుకున్నారు. సభలో కుటుంబ సభ్యులను పరిచయం చేశారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకొని నిక్‌నేమ్‌లతో పిలుచుకున్నారు. పాఠాలను నేర్పించిన ఉపాధ్యాయులను సత్కరించారు.