దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం ఎంతో అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుందని వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద వరంగల్ రైల్వే స్టేషన్ కు రూ 25 కోట్ల నిధులచే అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధమవుతున్న తరుణంలో వరంగల్ రైల్వే స్టేషన్ ను ఆదివారం వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు సందర్శించారు.