వరంగల్ కరీమాబాద్లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కివీ స్కూల్ వద్ద కారు ఓవర్ స్పీడ్ తో రోడ్ పక్కన ఉన్న షాప్ లోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. పలువురికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ తరలించారు. కారు ఓనర్ ఎస్ ఆర్ ఆర్ తోట కు చెందిన రాజేష్ గా పోలీసులు గుర్తించారు.