వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి సత్య శారదా దేవి చేతుల మీదుగా టీఎన్జీవోస్ జిల్లా క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఉద్యోగులందరూ నూతన సంవత్సరంలో కష్టపడి పనిచేసి జిల్లాను అన్ని రంగాలలో ప్రగతి పథంలో నడిపించాలని, జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని జిల్లాలోని ఉద్యోగులందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.