వరంగల్ రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

69చూసినవారు
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శ్రీరాం రాజు మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ మట్టేవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. విధులకై పోలీస్ కమిషనరేట్ కి ద్విచక్ర వాహనంపై వెళుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం వెనుక నుండి ఢీ కొనడంతో క్రింద పడి స్పృహ కోల్పోయాడు. దాంతో స్థానికుల సహాయంతో ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించే సమయంలో మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్